Breaking News

పారిశుద్ధ పనుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న ఎంపీఓ, గ్రామ కార్యదర్శి తీరును నిరసిస్తూ చెత్తలో కూర్చొని నిరసన తెలిసిన ప్రజాసంఘాల నాయకులు

మన ప్రగతి న్యూస్ /నల్లబెల్లి

మండలంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో రోడ్డుకు ఇరువైపులా ఉదయం 10;30 నిమిషాలు కావస్తున్న నల్లబెల్లి గ్రామపంచాయతీ రోడ్డుకు ఇరువైపులా పారిశుద్ధ పనులు చేయకపోవడంతో చెత్తలో కూర్చొని నిరసన తెలియజేశారు. అనంతరం ప్రజాసంఘాల నాయకులు బోట్ల నరేష్, అడ్డరాజు ,బొమ్మ కంటి అనిల్ మాట్లాడుతూ… గ్రామంలోని చెత్తాచెదారం లేకుండా పారిశుద్ధ పనులు నిరంతరం పర్యవేక్షణ చేసి గ్రామ పంచాయతీ అభివృద్ధికి కృషిచేసిన మండల పంచాయతీ అధికారి గ్రామ కార్యదర్శి రోడ్డుకు ఇరువైపులా చెత్తాచెదారం తో గ్రామం మొత్తం పారిశుద్ధ పనులతో లోపించింది.. ఇట్టి విషయంలో సంబంధిత ఉన్నత అధికారులు స్పందించి పారిశుద్ధ పనుల పట్ల నిర్లక్ష్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకొని, గత నాలుగు నెలల నుండి గ్రామపంచాయతీలో విధులు నిర్వహిస్తున్న మల్టీపర్పస్ వర్కర్ల వేతనాలు విడుదల చేసి వారిని ఆదుకోవాల్సిందిగా ఉన్నత అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో మేకల తిరుపతి, సిద్దు, నరేష్ ,సాల్మేల్ తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద కఠిన నిషేధాజ్ఞలు..