ప్రభుత్వ ఆదేశాలు పాటించని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల శనిగరం అధ్యాపక బృందం
వరంగల్ విద్యాశాఖ అధికారికి ఫోన్ ద్వారా సమాచారం అందిస్తే ఫోన్లో స్పందించని విద్యాశాఖ అధికారి
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయ బృందాన్ని సస్పెండ్ చేయాల్సిందిగా ఏ బి ఎస్ ఎఫ్ దళిత విద్యావంతుల వేదిక డిమాండ్
మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి
మండలంలోని శనిగరం జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా బస్సు వేళలు పాటిస్తూ తమ విధులను చేస్తున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైన విద్యార్థులను ఎగ్జామ్ హాల్లోకి రానివ్వకుండా వారి భవిష్యత్తును ప్రశ్నార్థకంలోకి నెట్టుతున్న అధికార యంత్రాంగానికి ఉపాధ్యాయులు మాత్రం తమకిష్టమైన సమయంలో రావచ్చు, పోవచ్చు మమ్మల్ని ప్రశ్నించే నాధుడే లేడనే ధీమతో పనిచేస్తున్న ఉపాధ్యాయులు.ఉపాధ్యాయ బృందం విధులు ముగించుకొని ముందే వెళుతున్న సందర్భంలో సంబంధిత హెడ్మాస్టర్ ప్రశ్నించగా ఐదు నిమిషాల క్రితమే బస్సు ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటుందని సమాచారం ఇవ్వడం వలన వారిని పంపించామని హెడ్మాస్టర్ సమాధానం ఇచ్చాడు . ఉపాధ్యాయులకు ఒక నిబంధన విద్యార్థులకు ఒక నిబంధన మరి విడ్డూరమని విద్యార్థుల తల్లిదండ్రులు , విద్యార్థి సంఘాలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా కలెక్టర్ మరియు విద్యాశాఖ అధికారి ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు నాణ్యత మైన విద్యను అందించాల్సిందిగా అధికారులకు ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న విద్యార్థుల పట్ల ఎంత నిర్లక్ష్యమో ఇట్టి సమస్యను చూస్తానే అర్థమవుతుంది. ప్రభుత్వ నిబంధనలు పాటించని ఉపాధ్యాయులపై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి విధుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న ఉపాధ్యాయ బృందాన్ని తక్షణమే సస్పెండ్ చేయాల్సిందిగా ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్, తెలంగాణ దళిత విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు బట్టు సాంబయ్య అన్నారు.