Breaking News

ఐ ఎన్ టి యు సి (ఎఫ్) కార్మిక విభాగ అధ్యక్షులుగా బట్టు మారుతి రాజు

మన ప్రగతి న్యూస్/హత్నూర:

ఐ ఎన్ టి యు సి (ఎఫ్) కార్మిక విభాగం అధ్యక్షులుగా సంగారెడ్డి జిల్లా హత్నూర మండల దౌల్తాబాద్ గ్రామానికి చెందిన బట్టు మారుతి రాజు మండల అధ్యక్షులుగా నియమిస్తున్నట్లు ఐ ఎన్ టి యు సి (ఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మురహరి బుద్ధారం, చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నట్లు మారుతి రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఉన్నటువంటి కార్మిక విభాగం అధ్యక్షునిగా నియమించిన రాష్ట్ర జిల్లా నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నాపై నమ్మకంతో అధ్యక్ష పదవి ఇచ్చినందుకు దానికి సమన్యాయం చేస్తూ కార్మిక విభాగాన్ని ముందుకు తీసుకెళ్తానని ఆయా శాఖలలో కమిటీలను ఏర్పాటు చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఐ ఎన్ యు సి (ఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్, మెదక్ జిల్లా అధ్యక్షులు ఎర్ర చంద్రశేఖర్ గౌడ్,సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రాజు యాదవ్, హత్నూర మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పటాన్చెరు నరేందర్, చెన్నారెడ్డి,ఆకుల నరేందర్, తదితరులు పాల్గొన్నారు.

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం