మన ప్రగతి న్యూస్/ మహబూబాబాద్

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం మన ప్రగతి తెలుగు జాతీయ దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కార వేదికగా పనిచేయాలన్నారు. నిజాయితీగా వార్తలు రాస్తూ సమాజ శ్రేయస్కు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అర్హులకు అందేలాగా మీడియా కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేయూ (ఐజేయు)జిల్లా అధ్యక్షులు చిత్తనూరి శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి గాడిపెల్లి శ్రీహరి,గూడూరు మండల అధ్యక్షులు గుర్రపు యాకంభ్రం,కోశాధికారి కుందూరు కరుణాకర్ రెడ్డి,మన ప్రగతి స్టాప్ రిపోర్టర్ సదువాల వీరస్వామి,కేసముద్రం రిపోర్టర్ వంశీ, మర్రిపెడ రిపోర్టర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
