మనప్రగతి న్యూస్/ జోగులాంబ గద్వాలజిల్లా ప్రతినిధి

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మన ప్రగతి తెలుగు జాతీయ దినపత్రిక క్యాలెండర్ ను జాయింట్ కలెక్టర్ లక్ష్మీనారాయణ, అడిషనల్ కలెక్టర్ ఇంచార్జి నర్సింగరావు చేతుల మీదుగా జిల్లా స్టాఫ్ రిపోర్టర్ స్వామితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ప్రగతి దినపత్రిక ప్రజల అభివృద్ధి కోసం పనిచేయాలని, నిజాయితీగా వార్తలు రాసి సమాజ శ్రేయస్ కు కృషి చేయాలి అన్నారు. సాంఘిక కార్యక్రమాల పట్ల యువతను చైతన్యపరిచే కథనాలు రాసి వారి భవిష్యత్తు కు తోడ్పడాలని అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తూ ప్రజా సమస్యల పరిష్కార వేదికగా మన ప్రగతి దినపత్రిక ఉండాలని కోరుకున్నారు.
