మన ప్రగతి న్యూస్ /నల్లబెల్లి

మండలంలోని సబ్ పోస్ట్ ఆఫీస్ ను పరకాల ఏ ఎస్ పి అనంతరం నాయక్ ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బిపిఎంలకు తగు సూచనలు ఇస్తూ పోస్ట్ ఆఫీస్ ద్వారా లబ్ధి పొందే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేయాలని తెలిపారు. అంతేకాక గ్రామీణ ప్రాంత ప్రజలందరూ పోస్ట్ ఆఫీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తపాలా శాఖలో జీవిత బీమా, సుకన్యకాత, రికరింగ్ డిపాజిట్లు, సేవింగ్ ఖాతాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లబెల్లి ఎస్ పి ఎం కుమారస్వామి మరియు బీపీఎంలు పాల్గొన్నారు.
