Breaking News

బాలికల హాస్టల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

మెనూ ప్రకారం భోజనం పెట్టలేదని వార్డెన్ కు షోకాజ్ నోటీసులు జారీ

మనప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ప్రభుత్వ గిరిజన బాలికల హాస్టల్ ను కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు.మెనూ ప్రకారం భోజనం పెట్టలేదని గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డెన్ జయలక్ష్మికి షోకాజ్ నోటీసులు జారీ చేసి,హాస్టల్ పరిసరాల్లో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ పనులను పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ శాఖ అధికారులను ఆదేశించారు.విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.