మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్
ముస్తాబాద్ : మండలం తుర్కపల్లి గ్రామంలోని ప్రజలకు స్థానిక ఎస్సై సిహెచ్ గణేష్ ఆధ్వర్యంలో మీ కోసం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సీఐ మొగిలి హాజరై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుర్కపల్లి గ్రామంలోని ప్రజలకు రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. సైబర్ నేరాలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సీసీటీవీ వ్యాపారాల వాణిజ్యాల సముదాయం లో దొంగతనాలు అరికట్టాలంటే కెమెరాల తప్పకుండా ప్రతి ఒక్కరు ఏర్పాటు చేసుకోవాలని కోరారు.మాదక ద్రవ్యాల డ్రగ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలని తెలిపారు. కుల నిర్మూలన ధరావత్ వంటి అంశాలను వివరించారు. ఈమధ్య మొదలైన సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేయడం అనవసరంగా పోస్ట్ వీడియోలు షేర్ చేయడం వంటి విషయాలకు దూరంగా ఉండాలని. లేకుంటే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు…
