Breaking News

అనుమతులు లేకుండా కలప కర్ణాటకకు తరలింపు

మన ప్రగతి న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి

జోగులాంబ గద్వాల జిల్లాలోని కేటిదొడ్డి మండల పరిధిలో పలు గ్రామాలలో పచ్చని చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్ట రాజ్యాంగ నరికి కట్టెలను కర్ణాటక రాయచూర్ జిల్లాకి తరలిస్తున్నారు, మండల పరిధిలోని పలు గ్రామాలలో, కర్ణాటకకు చెందిన వ్యాపారస్తులు స్థానికఉన్న కట్టెల వాహనదారులు, అటవీ శాఖ అధికారుల అనుమతులు లేకుండా, చెట్లను నరికి బట్టీలకు తరలిస్తున్నన్నారు. అక్రమ రవాణాను అడ్డుకున్న నాధుడే లేడు.

తల్లి కూతుర్ల అదృశ్యం

ఇటుక బట్టిలు కాల్చడానికి కలప తప్పనిసరిగా అవసరం. బట్టిలకు రాత్రి పగలు తేడా లేకుండా కలపను వాహనదారులు తరలిస్తున్నారు.అధికారులు కఠిన చర్యలు తీసుకొని అక్రమంగా జరుగుతున్న చెట్ల నరికివేతను అరికట్టాలని మండలప్రజలు కోరుతున్నారు. ఒక్కరోజు కూడా బోర్డర్ మండలాల్లో ఏమి జరుగుతుందని ఫీల్డ్ కి వెళ్ళింది లేదు అటుసైడ్ కన్నెత్తి చూడటంలేదు.ప్రజలకు ఫారెస్ట్ అధికారులు ఎవరు అని కూడా తెలియదు అధికారులు రోజు ఫీల్డ్ కి వెళ్తే ప్రజలతో మమేకమైనప్పుడు ఎక్కడైనా చెట్లు నరకినట్టుగా సమాచారం ఉంటే అలాంటి సమాచారాన్ని తమకు తెలియపరచడానికి వీలుగా ఉంటుంది అని ప్రజలు అనుకుంటున్నారు.