మన ప్రగతి న్యూస్/ నడికూడ:
వరంగల్ జిల్లా సహకార బ్యాంక్ సర్వ సభ్య సమావేశం హనుమకొండలోని ప్రధాన కార్యాలయంలో టిఎస్ సిఏబి చైర్మన్ మార్నేని రవీందర్ రావు ఆధ్వర్యం లో సమావేశం నిర్వహించారు. ఈ సమా వేశంలో ఇటీవల ఓడిసిఎంఎస్ జిల్లా డైరెక్టర్ గా ఎన్నికైన మాదారం పిఏసిఎస్ చైర్మన్ నల్లెల లింగమూర్తి ని టీఎస్ సిఏబి చైర్మన్ మార్నేని రవీందర్ రావు శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం లో డీసిసిహెచ్ డైరెక్టర్లు, వివిధ సంఘాల చైర్మన్లు పాల్గొని.. లింగమూర్తికి శుభాకాంక్షలు తెలియజేశారు.
