కమీషనర్ దండు శ్రీనివాస్
మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి
నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీ లో రెండో రోజు ప్రజాపాలన వార్డు గ్రామ సభలో బాగంగా 2,6,11 వార్డులలో గ్రామ సభలు నిర్వహించటం జరిగింది.ఈ గ్రామ సభలకు నందికొండ మున్సిపాలిటీ కమీషనర్ దండు శ్రీనివాస్ పాల్గొనటం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుందని అన్నారు. బుధవారము నందికొండ మున్సిపాలిటీ వార్డుల
గ్రామసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకాలు అమలు జరిగే విధంగా ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని, జాబితాలో పేరు లేనివారు ఆందోళన చెందకుండా గ్రామ సభకు వచ్చిన అధికారులకు తమ దరఖాస్తులను అందజేయాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు అన్ని సంక్షేమ పథకాలను అందజేయడం జరుగుతుందని ఇది నిరంతరం ఒక ప్రక్రియగా కొనసాగుతుందని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ తో పాటు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఆదాస్ నాగరాణి విక్రం, వార్డు ఆఫీసర్స్ సంద్య, చెన్న మల్లు , జూనియర్ అసిస్టెంట్ ఉమా మహేష్ , ప్రియాంకా, ఆర్పీ టీకే రేణుకా ప్రజలు పాల్గొన్నారు.