Breaking News

ఉద్యోగాలు ఇప్పిస్తామని యువత వద్ద లక్షల రూపాయలు వసూలు చేసిన నకిలీ జడ్జి అరెస్ట్.

ముద్దాయిని తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామానికి చెందిన సామంతుల నరేందర్ గా గుర్తింపు.

ఇదే కోవలో ఏలూరు నగరంలోని కొత్తపేటకు చెందిన నామాల నిర్మల అలియాస్ సామంతుల నిర్మలను మ్యాట్రిమోనీ ద్వారా పరిచయం చేసుకొని వివాహం చేసుకున్న వైనం.

వివాహ సమయంలో 25 లక్షలు కట్నంగా తీసుకున్న నరేందర్ మరొక 50 లక్షలు డిమాండ్ చేయడంతో ఏలూరులోని మహిళా పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన నిర్మల.

దీంతో కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ కాంతిప్రియ దర్యాప్తు చేపట్టడంతో నకిలీ జడ్జి అవతారంలో ఎందర్నో మోసగించినట్లు విషయం వెలుగు చూసిన వైనం.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

నిందితుడి పై ఇప్పటికే ఖమ్మం, వరంగల్ జిల్లాలో పలు కేసులు నమోదయి ఉన్నట్లు గుర్తింపు.

ముద్దాయి నరేందర్ గతంలోనే అనేక మోసాలకు పాల్పడి ఎంతమంది యువతీ యువకుల జీవితాలతో ఆటలాడుకున్నట్లు గుర్తించడంతో ఎస్సై కాంతిప్రియ ఆధ్వర్యంలో బుధవారం ఏలూరు రైల్వే స్టేషన్ లో నిందితుడు నరేందర్ ని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసిన వైనం.

ఏలూరులోని డిఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన డిఎస్పీ శ్రావణ్ కుమార్.