Breaking News

అన్యకాంతం అవుతున్న భూములను కాపాడాలి

  • సిపిఎం ఆధ్వర్యంలో ఉప తహసిల్దార్ కు వినతి పత్రం అందజేత
  • సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి సోమయ్య

మన ప్రగతి న్యూస్/ జఫర్‌గడ్:
మండల కేంద్రంతో పాటు, మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములకు హద్దు రాళ్లు నిర్ణయించి, భూములను కాపాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి సోమయ్య పేర్కొన్నారు. బుధవారం జనగామ జిల్లా జఫర్‌గడ్ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో ప్రభుత్వ భూములను హద్దులు నాటి కాపాడాలని ఉప తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో, మండల కేంద్రంలో అన్యక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములు కాపాడాలని సిపిఎం పార్టీ మండల కమిటీ తరఫున విజ్ఞప్తి చేశారు. మండలంలోని 22 గ్రామపంచాయతీలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు గుర్తించి హద్దులు నాటాలని రెవెన్యూ వారిని కోరారు. అలాగే ప్రభుత్వ భూములకు ఫినిషింగేసి బోర్డు నాటాలని విజ్ఞప్తి చేశారు. కాపాడని పక్షంలో సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములలో పేదలచే గుడిసెలు వేసి పేద ప్రజలకు పంచుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గుండెబోయిన రాజు, మండల కమిటీ సభ్యులు కాట సుధాకర్, వడ్లకొండ సుధాకర్ ,యాతం సమ్మయ్య, నాయకులు శంషాద్దీన్, తాళ్ల పెళ్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం