అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ – ఉషశ్రీ
మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్
జాతీయ రహదారి భద్రతా మాసోత్సావాల సందర్భంగా గురువారం నాగార్జున సాగర్ పైలాన్ కాలనీ లోని బైపాస్ రోడ్డు లో ఉన్న ఆటో స్టాండ్ వద్ధ ,అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇ.ఉషశ్రీ, రోడ్డు నిబంధనలను గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించటం జరిగింది.ఈ సందర్భంగా ఆమె ఆటో డ్రైవర్ల తో, ద్విచక్ర వాహనదారుల తో మాట్లాడుతూ సెల్ ఫోన్ మాట్లాడుకుంటు, మద్యం సేవించి వాహనాలు నడపటం మంచిదికాదని రాంగు సైడ్ డ్రైవింగ్ ప్రమాదకరమని ఆమె తెలియజేశారు. అలాగే వాహన దారులు ప్రతి ఒకరు ట్రాఫిక్, రోడ్డు నిబంధనలు, ఖచ్ఛితంగా పాటిస్తూ వాహనాలను నడపాలని ద్విచక్ర వాహన దారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని,నాలుగు చక్రాల వాహన దారులు సీట్ బెల్ట్ ధరించి వాహనం నడపాలని అందరికి ,జీవితా భీమా, ఖచ్చితంగా ఉండాలని తెలియజేశారు.ప్రమాదాలు జరుగకుండా ప్రయాణాలు కొనసాగించాలని చిన్న ప్రమాదమైనా పెద్ద ప్రమాదమైన కుటుంబాలు వీధిన పడే అవకాశాలు ఉంటాయని ప్రమాద భారిన పడిన కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగానూ కుంగిపోయో పరిస్థితి ఉంటుందని ఇంటి యజమాని ప్రమాదానికి గురి అయితే కుటుంబ సభ్యుల మనోవేదన వర్ణణాతితం అని మానవ తప్పిదాల వలనే ఎక్కువ భాగం ప్రమాదాలు జరుగుతున్నాయని ఆటోలలో పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించుకోవటం వలన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని వాహనాలను నడిపే వారు మద్యం సేవించి వాహనాలను నడపకుండా అతి వేగంతో ప్రయాణం చేయకుండా పరిమితికి మించి వేగంతో నే ప్రయాణం కొనసాగించాలని ప్రమాదం జరిగినప్పుడు బాధ పడటం కంటే ఆ ప్రమాదాలు జరగకుండా చూసుకోవటం మంచిదని ఆమె ఆటో డ్రైవర్లను ఉద్దేశించి తెలియజేశారు.ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తో పాటు ఆటో డ్రైవర్లు ముజీబ్,మంజూర్, మన్సూర్, నజీర్, రమేష్ సిబ్బంది, స్థానిక పట్టణ యువత పాల్గొన్నారు.