Breaking News

ఏ బి సీ డి వర్గీకరణ కు వేలాది గా కదలి రండి

ఎంఆర్పీఎస్ ఇన్ ఛార్జ్ ఆడెపు నాగార్జున

మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు ,లక్ష డప్పులు వేల గొంతులు , కార్యక్రమాన్ని ఫిబ్రవరి 7 వ తారీఖున హైదరాబాద్ లో తల పెట్టిన సభను విజయవంతం చేయాలని ఉదేశ్యం తో నాగార్జున సాగర్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పట్టణ కమీటి ఆధ్వర్యంలో జయప్రదం చేయాలని ఉదేశ్యం తో హిల్ కాలనీ మెయిన్ బజారు నుండి అంబేద్కర్ విగ్రహం వరకు డప్పుల ప్రదర్శన నిర్వహించటం జరిగింది.ఈ కార్యక్రమం లో నాగార్జున సాగర్ నియోజకవర్గం ఇన్చార్జి ఆడెపు నాగార్జున పాల్గొనటం జరిగింది . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంద కృష్ణ సామాజిక అంశాల మీద పోరాటం చేసి చిన్న పిల్లలకు గుండె జబ్బుల విషయంలో, వికలాంగులకు ప్రత్యేక రాయితీలు కల్పించే విధంగా పోరాటం చేసి పింఛన్లు వచ్చే విధంగా చర్యలు తీసుకున్న గొప్ప నాయకుడని ,ఒంటరి మహిళలకు ఫించన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకొని అప్పటి రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో నిరుపేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించే విధంగా ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టేటట్టు చేసి పేద ప్రజలకు ఆరాధ్య దైవం అయినాడని అదే పోరాట పటిమ ప్రదర్శిస్తు గత 30 సంవత్సరాల నుండి ఏబిసీడీ వర్గీకరణకు అహర్నిశలు కృషి చేస్తూ నిరంతరం వర్గీకరణ కోసం తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా తపన పడుతున్న గొప్ప నాయకుడని అలాంటి మహానుభావుడు పిలుపు మేరకు హైదరాబాద్ లో ఫిబ్రవరి 7 న జరిగే సభను ప్రతి ఒకరు బాధ్యత తీసుకొని విజయవంతం చేయాలని ఏబిసిడి వర్గీకరణ అనేది సామాజిక న్యాయమైన డిమాండ్ అని మాదిగ సోదరులతో పాటు దాని ఉపకులాల సోదరులు అందరు భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని ఈ సభను విజయవంతం చేయవలసినదిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆడెపు నాగార్జున తో పాటు మంద రఘువీర్ బిన్నీ ,పెంచలరాజు మాదిగ ,కొమ్ము రాందాస్ మాదిగ , జి. బద్రి మాదిగ, పగిడిమర్రి అంజి మాదిగ, క పోలేని యాదగిరి ,కొమ్ము పుల్లారావు,అందుగుల రాజీవ్, చుక్క ప్రభాకర్ వీరబాబు,జి.బద్రి ,లక్ష్మయ్య, శాఖ కొంపల్లి సురేష్ రాజేష్ చాచా పి రవీందర్, సిహెచ్ ప్రవీణ్ కుమార్, పెంచల రాజు, నకుల్ రావు మాదిగ, వెంకట్ మాదిగ, రామకృష్ణ మాదిగ మొదలైన వారు పాల్గొన్నారు.