Breaking News

ఘనంగా వసంత పంచమి వేడుకలు

మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి

నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో సోమవారం పాఠశాల ప్రిన్సిపాల్ రాజశేఖర్  ఆధ్వర్యంలో వసంత  పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసంత  ఋతువు ఆరంభంలో వచ్చే వసంత పంచమి రోజున చదువుల తల్లి సరస్వతి దేవి ఆరాధనకు శ్రేష్టమైనదని,
వసంత పంచమినే శ్రీ పంచమి అని కూడా అంటారని సరస్వతీ దేవి పూజా సమయంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి కొత్త పుస్తకాలు, పెన్ను,పెన్సిళ్లను పూజిస్తారని అన్నారు. అదే విధంగా సంగీత వాయిద్యాల వంటి వాటిని ఆ రోజు ప్రత్యేకంగా పూజించడం వలన కళలలో నిష్ణాతులు అవుతారని విశ్వాసమని ఆ రోజున దేవాలయాలతో పాటు పాఠశాల, కళాశాలల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం