Breaking News

గ్యాస్ సిలిండర్ పేలి… ఇల్లు దగ్ధం

  • స్టేషన్ ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెం గ్రామంలో ఘటన

మన ప్రగతి న్యూస్/ స్టేషన్ ఘన్‌పూర్ :

జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని ఇప్పగూడెం గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం మైన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం ఇప్పగూడెం గ్రామం ఒకే కుటుంబానికి చెందిన తోడేంగల మల్లయ్య, తోడంగల కృష్ణమూర్తి, తోడంగల ఐలయ్య లకు చెందిన మూడు ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు.. పూర్తి ఇండ్లు దెబ్బ తినడంతో ఆస్తి నష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పారు

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద కఠిన నిషేధాజ్ఞలు..