Breaking News

నిబంధనలకు విరుద్దంగా ఇసుక దందా

క్వారీ ఒకదగ్గర నిర్వహణ మరో దగ్గర

పర్యవేక్షణ లేని అధికారులు

చర్యలు తీసుకోవాలి అని కోరుతున్న ప్రజలు

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద కఠిన నిషేధాజ్ఞలు..

మనప్రగతి న్యూస్/ మంగపేట:ములుగు జిల్లా మంగపేట మండలంలోని రమనక్కపేట గ్రామ పంచాయతీ పరిధిలో కొమురం భీమ్ ఇసుక సొసైటీ పేరుతో క్వారీ నిర్వహణ జరుగుతుంది. ఇక్కడే వాడగూడెం పేరుతో రామనక్కపేట రెవెన్యూ పరిధిలోని పట్టా ఇసుక క్వారీ నిర్వహణ జరుగుతుంది దీనినే ఆసరగా చేసుకున్న రెయిజింగ్ కాంట్రాక్టర్స్ అధికారంలో ఉన్న కొందరు రాజకీయ పెద్దలను ఉపయోగించుకొని మాకు ఇసుక దంధాలో ఎవరు అడ్డులేదని రమనక్కపేట సొసైటీ పేరుతో ఆన్ లైన్ పెట్టించుకొని పట్టా క్వారీలోని ఇసుకను ప్రతి రోజు దొంగచాటుగా పంపిస్తున్నరని , క్వారీల నిర్వహణ మీద టీజీ ఎండిసి అధికారుల పర్యవేక్షణ లేకపోవటంతో దందాకు అడ్డేలేకుండా పోయింది అని
వాస్తవానికి రమనక్క పేట సొసైటీకి గోదావరినుండి స్టాక్ పాయింట్ కు ఇసుక తోలకానికి ఈసి పర్మిషన్ లేకున్నా రాత్రి సమయంలో భారీ వాహనాలు భారీ యంత్రాలతో ఇసుక తొవ్వకాలు జరుపుతున్నారు అని ప్రజలు ఆరోపిస్తున్నారు.అదేవిధంగా పట్టా క్వారీలో ఏటువంటి నిబంధనలు పాటించకుండా లోతైన గోతులు తీసి ఇసుక తొలకలు జరుపుతున్నారు.
గోదావరిలో పట్టా భూములలో ఇసుక మేట వేస్తే ఆయొక్క ఇసుకను తొలగిస్తే మళ్ళీ పంట వేసుకునే అవకాశం ఉంటేనే ఇసుక తవ్వకాలు జరపడానికి పర్మిషన్ ఇవ్వాలి కానీ ఎటువంటి నిబంధనలు పాటించటం లేదు.
ఇకనైనా ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి నిబంధనలు పాటించని సొసైటీని పట్టా క్వారీ మీద విచారణ జరిపి ఆపాలని నిర్వహణదారుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.