Breaking News

గూడెం గ్రామంలో పీపుల్స్ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం

_ డాక్టర్ చింతోజి శంకర్ ఆధ్వర్యంలో

_ ప్రజలు అందరూ వినియోగించుకోవాలి..

_ కన్వీనర్ పార్లమెంట్ చక్రధర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్రెడ్డి

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద కఠిన నిషేధాజ్ఞలు..

మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్

రాజన్న సిరిసిల్ల :ముస్తాబాద్ మండల కేంద్రంలోని పీపుల్స్ హాస్పిటల్ యజమాన్యం డాక్టర్ చింతోజీ శంకర్ సార్ ఆధ్వర్యంలో సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి. సారధ్యంలో గూడెం గ్రామంలోని హైస్కూల్లో రేపు 2వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత వైద్య శిబిరం కలదు. అన్ని రకాల జబ్బులకు డాక్టర్లు ఉచితంగా పరీక్షలు చేసి ఎక్సరే ఈసీజీ మందులు కూడా ఉచితంగా అందించబడును అని తెలిపారు.కాబట్టి మండలంలోని ప్రజలందరూ కూడా హాజరై పరీక్షలు నిర్వహించుకోవాల్సిందిగా కోరుతున్నాం అని తెలిపారు. వాటిలో గుండె జబ్బు లివర్ కంటిచూపు నరాల బలహీనత అన్ని రకాల వ్యాధులకు చికిత్స అందించబడును అని సూచించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పలువురు గూడెం గ్రామంలో జరుగుతున్న ఉచిత మెగా వైద్య ప్రాంగణాన్ని పరిశీలించిన పార్లమెంట్ కో కన్వీనర్ కనమేని చక్రధర్రెడ్డి. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ళ బాల్ రెడ్డి. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అంజన్ రావు ముస్తాబాద్ డాక్టర్ చింతోజి శంకర్ వీరితోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..