Breaking News

ఏన్కూర్ మండలంలో పర్యటించిన ఎంపీ రఘురాం రెడ్డి

మన ప్రగతి న్యూస్/ ఏన్కూర్

ఏన్కూర్ మండలం జన్నారం గ్రామం లో మంగళవారం ఖమ్మం జిల్లా పార్లమెంటు సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి పర్యటించారు. తొలుత కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు స్వర్ణ నరేంద్ర నివాసంలో ఆయనను శాలువాతో సత్కరించారు.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కలిసి వారితో ముచ్చటించారు. అనంతరం జిల్లా నాయకులు గుత్త వెంకటేశ్వరరావు తండ్రి మరణించగ వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ చైర్మన్ మువ్వ విజయ్ బాబు,
బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొండ బాల కోటేశ్వరరావు,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బొర్రా రాజశేఖర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కట్ట కృష్ణార్జునరావ్, మరియు ఏన్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ముక్తి వెంకటేశ్వర్లు, మేడ ధర్మారావు, కట్ట సత్యనారాయణ, గిద్ద గిరి సత్యనారాయణ, నల్లమల్ల శివకుమార్, స్వర్ణ ప్రహల్లాద రావు, ఇంజమ్ శేషగిరిరావు, ఒక్కంతుల నాగార్జున,గుగులోత్ శోభన్ నాయక్, గుగులోత్ లచ్చిరాం నాయక్, మరియు వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం