Breaking News

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ను పకడ్బందీగా నిర్వహించాలి

_ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

_ ప్రతి ఓటర్ కు ఓటర్ స్లిప్ లను పంపిణీ చేయాలి

_ ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహణ

_ ప్రతి 2 గంటలకు పోలింగ్ రిపోర్టు వివరాలను పంపాలి

_ పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

మన ప్రగతి న్యూస్ /రాజన్న సిరిసిల్ల,

శాసనమండలి ఎన్నికల పోలింగ్ జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.మంగళవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
చందుర్తి, కోనరావు పేట మండల కేంద్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో, వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఆర్డీఓ రాజేశ్వర్ తో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, పోలింగ్ సజావుగా జరిపేందుకు వీలుగా పోలింగ్ కేంద్రాలలో అవసరమైన అన్ని సౌకర్యాలు ఉండాలని, సీసీ కెమెరాలు లేదా వెబ్ కాస్టింగ్ తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి ఓటర్ స్లిప్ పంపిణీ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద
ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు శాసనమండలి ఎన్నికల పోలింగ్ జరుగుతుందని అన్నారు.

పోలింగ్ కేంద్రం పరిసరాలను చెక్ చేసుకోవాలని ,100 మీటర్ల రేడియస్ లో ఎన్నికలను ప్రభావితం చేసేలా ఎటువంటి ప్రచారం జరగడానికి వీలు లేదని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద డమ్మీ బ్యాలెట్ అతికించాలని అన్నారు.

పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు లైన్లో వచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని, దివ్యాంగులు వృద్ధులు గర్భిణీ స్త్రీలు ప్రాధాన్యతతో ఓట్లు వేసే విధంగా చూడాలని, 100 మీటర్ల పరిధిలో ఓటర్ సహాయ కేంద్రానికి హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాలని అన్నారు.

పోలింగ్ లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ పాస్ బుక్ , పాన్ కార్డు ఆధార్ కార్డు, పెన్షన్ డాక్యుమెంట్, జాతీయ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్, యూడి ఐడి, హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు గుర్తింపు కోసం ఓటర్లు తమ వెంట తీసుకుని రావాల్సి ఉంటుందని అన్నారు.

పోలింగ్ నాడు ఉదయం ఖాళీగా ఉన్న బ్యాలెట్ బాక్స్ ను ఏజెంట్లకు చూపించాలని, గ్రీన్ పేపర్ లో ఏజెంట్ల సంతకాలు తీసుకుని సీజ్ చేయాలని, బ్యాలెట్ బాక్స్ పై పోలింగ్ కేంద్రం వివరాలు ఉండే విధంగా పేపర్ అతికించాలని, ఓటర్ సీక్రసి కాపాడేందుకు వీలుగా ఓటింగ్ కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేయాలని అన్నారు.

పోలింగ్ నాడు ప్రతి రెండు గంటలకు ఒకసారి అంటే 10 గంటలకు, 12 గంటలకు, 2 గంటలకు, పోలింగ్ ముగిసిన తరువాత 4 గంటలకు పోలింగ్ వివరాలను ప్రకటించాలని అన్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకు ఓటర్ స్లిప్పులు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఓటు వేసే అవకాశం కల్పించాలని, అన్నారు. చివరి ఓటర్ ఓటు వినియోగించుకున్న తర్వాత నిబంధనలు ప్రకారం బ్యాలెట్ బాక్సులను మూసివేసి సీల్ చేయాలని, ప్రతి ఒక్క సిబ్బంది తన మాన్యువల్ ను ఒకటికి రెండు సార్లు పరిశీలించు కోవాలని , విధులను పక్కగా నిర్వహిస్తూ ప్రశాంతంగా ఓటింగ్ జరిగేలా చూడాలని అన్నారు. అనంతరం కోనరావుపేట మండలం వెంకట్రావు పేట గ్రామంలోని ఇసుక రీచ్ ను పరిశీలించారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట వేములవాడ ఆర్డిఓ రాజేశ్వర్ తహసిల్దార్లు విజయ్ ప్రకాష్ రావు , మహేష్, సుజాత, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.