Breaking News

12 మంది ఆప్‌ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన స్పీకర్

మన ప్రగతి న్యూస్/ న్యూఢిల్లీ

12 మంది ఆప్‌ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన స్పీకర్
ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంగళవారం సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ 12 మంది ఆప్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. బీజేపీ నేతలు ఇటీవల సీఎం కార్యాలయం నుంచి బీఆర్‌ అంబేడ్కర్, భగత్‌ సింగ్‌ల ఫొటోలు తొలగించారు. దీనిపై ఆప్ నేతలు అసెంబ్లీలో ఆందోళన చేపట్టారు. అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగిస్తుండగా నిరసన చేపట్టడంతో స్పీకర్ వారిని ఒక రోజు పాటు సభ నుంచి సస్పెండ్‌ చేశారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం