_ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ,
మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను పరిశీలన
మన ప్రగతి న్యూస్/ వేములవాడ:

దక్షిణ కాశీక్షేత్రం, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి జాతర సందర్భం గా.. ప్రభుత్వ యంత్రాంగం సామా న్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటు న్నామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. మంగళ వారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వ ర స్వామి దేవస్థానాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ లు దర్శించుకుని, మహా శివరాత్రి జాతర సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఆలయ అధికారులు పలు సూచనలు అందజేశారు. క్యూ లైన్లు, కోడె మొక్కు లైన్, ధర్మ గుండం, ప్రధాన ద్వారం, ప్రసాదం తయారీ కేంద్రాన్ని, అంబేద్కర్ కూడలి ని పరిశీలించారు. ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా క్షేత్ర స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ తరపున పటిష్ట బందో బస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పార్కింగ్ కు ఇబ్బందులు కలగ కుండా చర్యలు చేపట్టామని వివరించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్, ఆలయ ఈఓ వినోద్ రెడ్డి, మున్సి పల్ కమిషనర్ అన్వేష్, తహసీల్దా ర్ మహేష్, ఈ ఈ రాజేష్, సిఐ. వీర ప్రసాద్, ఆలయ సిబ్బంది తదితరులున్నారు.
