Breaking News

.

కనుల పండుగగా సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి :

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని బుధవారం శివ పార్వతుల కళ్యాణ మహోత్స కార్యక్రమం కనుల పండగ జరగగా గురువారం రథోత్సవాన్ని రంగురంగుల పూలతో అలంకరించి ఆల అర్చకుల వేదమంత్రోత్సవాల నడుమ శివపార్వతుల లక్ష్మీనరసింహస్వామి ల ఉత్సాహమూర్తులను వివిధ పూలతో అలంకరించి రథంపై ఏర్పాటు చేశారు. రథోత్సవం, బండ్లు తిరుగుట కార్యక్రమంలో భాగంగా రథోత్సవ కార్యక్రమం శోభాయానంగా జరిగింది.

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద కఠిన నిషేధాజ్ఞలు..

రథోత్సవ కార్యక్రమాన్ని జనగామ సివిల్ జడ్జి రవీంద్ర శర్మ, వర్ధన్నపేట ఏసీపీ అంబటి నరసయ్య, సీఐ మహేందర్ రెడ్డి,పాలకుర్తి ఎస్సై దూలం పవన్ కుమార్, ఆలయ ఈవో సల్వాది మోహన్ బాబు లు ప్రారంభించారు. ఆటపాటలతో, కోలాట బృందాలతో డప్పు వాయిద్యాలతో రథోత్సవ యాత్ర కనుల పండుగగా కొనసాగింది. ప్రధాని విద్యుత్ దీపాలతో అలంకరించారు. పాలకుర్తి పురవీధుల గుండా సాగిన రథోత్సవానికి ప్రజలు మంగళహారతులతో మహిళలు స్వాగతం పలికారు.

రథోత్సవం సందర్భంగా విద్యుత్ తీగలు తో అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. రథోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని భక్తులు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, ఆటోలు, బొలోరాలతో ఆంజనేయ స్వామి ఆలయం, శంకరుని విగ్రహం చుట్టూ తిప్పుతూ మొక్కులు తీర్చుకున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విధులు నిర్వహించిన పోలీస్ సిబ్బందిని, ఎన్సిసి వాలంటీర్లను ఆలయ అధికారులు సన్మానించి ప్రశంసా పత్రాలను అందజేశారు. స్వామివారి కళ్యాణం సమన్వయంతో విజయవంతం చేయడం, స్వామి వారిని దర్శించుకునేందుకు పోలీసులు చేసిన కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపర్డెంట్ కొత్తపల్లి వెంకటయ్య, విద్యుత్ శాఖ ఏఈ ఆవిరినేని రణధీర్, ఎస్సై లింగారెడ్డి, అర్చకులు డివిఆర్ శర్మ, దేవగిరి అనిల్, మతగజం నాగరాజు, వాహనకారు లు చిదురాల ఎల్లయ్య, ఆలయ సిబ్బంది, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.