మనప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి:-ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు శ్రీ మాన్ మానేపల్లి రామారావు,మానేపల్లి మురళీకృష్ణ,మానేపల్లి గోపికృష్ణ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.శ్రీ వేంకటేశ్వర స్వామి వారు తన వివాహ సమయంలో లక్ష్మి నరసింహ స్వామి వారిని ఆరాధించి నివేదనలు చేసినట్లు వేంకటచల మహాత్మ్యం తెలుపున్నది.