బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

బాలికలకు మరుగుదొడ్లు లేని పాఠశాలలు , వాటి నిర్మాణం కోసం పరిశీలన

బాలికలకు మరుగుదొడ్లు లేని పాఠశాలలు , వాటి నిర్మాణం కోసం పరిశీలన

మన ప్రగతి న్యూస్/ ములకలపల్లి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుండి జిల్లా కోఆర్డినేటర్ లు ఎన్.సతీష్ కుమార్, ఎస్. కె. సైదులు యు.పి.ఎస్ మాదారం, ఎం.పీ.పీ.ఎస్ విజయపురి కాలనీ, ఎం.పీ.పీ.ఎస్ ములకలపల్లి పాఠశాలలను గురువారం సందర్శించి బాలికల టాయిలెట్స్ ఆవశ్యకతకు సంబంధించి పాఠశాల ఆవరణను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ సూచన మేరకు గర్ల్స్ టాయిలెట్స్ లేని పాఠశాలల్లో యుద్ధ ప్రాతిపదికన టాయిలెట్స్ నిర్మించేందుకు గాను ప్రణాళికను రూపొందించుటకు గాను సందర్శించినైనదని అన్నారు.
మన ఊరు – మనబడి కింద మంజూరు ఆయిన పనుల యొక్క పురోగతి మరియు ఆగిపోయిన పనులు ఏ స్థాయిలో ఆగినాయో, ఎందుకు ఆగినాయో మండల విద్యాధికారి,ప్రధానోపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించి, భోజనం టేస్ట్ చేయడం జరిగింది. మెనూ ప్రకారం నాణ్యత కలిగిన ఆహారాన్ని మధ్యాహ్న భోజనంలో అందించాలని వంట ఏజెన్సీ వారికి మరియు ప్రధానోపాధ్యాయులకు సూచించినారు. అదేవిధంగా పాఠశాలలలోని స్పోర్ట్స్ కిట్ మరియు పాఠశాల శానిటేషన్ కిట్ లను ప్రత్యేకంగా పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్ లు యస్. కె. సైదులు, ఎన్. సతీష్ కుమార్, మండల విద్యాధికారి జి సత్యనారాయణ, కాంప్లెక్స్ హెచ్ఎం లతా, టీజీడబ్ల్యు ఐ డి సి ఏ.ఈ రాజగోపాల్, పాఠశాలల హెచ్ఎం, ఇతర పాఠశాల సహ ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లితండ్రులు పాల్గొన్నారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం