Breaking News

పేకాట రాయుళ్లు అరెస్టు

మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్

_ నాలుగు ద్విచక్ర వాహనాలు ఒక కారు ఆటో సీజ్

_ 9 మంది పై కేసు నమోదు

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ మండలంలో రామ లక్ష్మణ పల్లె గ్రామంలో 9 మంది వ్యక్తులు పేకాట ఆడుతూ పట్టు పడగా వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గణేష్ తెలిపారు. వారి వివరాల ప్రకారం రామ లక్ష్మణ పల్లె గ్రామ శివారులో 9 మంది వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు సమాచారం వచ్చింది. ఎస్సై తన సిబ్బంది యుక్తంగా వెళ్లి తనిఖీ చేయగా 13,340/- రూపాయల నగదు తోపాటు నాలుగు ద్విచక్ర వాహనాలు ఒక కారు, ఆటోను సీజ్ చేసి తొమ్మిది మంది పైన కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.