Breaking News

విద్యుత్ ఘాతంతో ఇల్లు దగ్ధం.

  • బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే చల్లా..

మన ప్రగతి న్యూస్/ పరకాల:

విద్యుత్ ఘాతంతో ఇల్లు దగ్ధమైన ఘటన హనుమకొండ జిల్లా పర కాల మండలం కామారెడ్డి పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. విషయం తెలిసిన పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి బాధితులు రేణుకుంట్ల కుమార స్వామి (ధర్మ), సమ్మయ్య కుటుం బాలను పరామర్శించారు. సంఘ టన జరిగిన తీరును బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమా దంలో ఇంట్లోని వస్తువులు, నిత్యా వసర వస్తువులు, వంట సామాగ్రి, 5 క్వింటాళ్ల బియ్యం, రూ.1లక్ష నగదు కాలి బూడిద అయినట్లు బాధితు లు మాజీ ఎమ్మెల్యే తెలుపుతూ వాపోయారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లా డుతూ…బాధిత కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. పరకాల తహసీల్దార్ కు ఫోన్ లో మాజీ ఎమ్మెల్యే మాట్లా డుతూ ఘటన స్థలాన్ని సందర్శించి, ఇరు కుటుంబాలకు తక్షణమే బియ్యం,నిత్యావసర సరుకులు అందేలా చూడాలని కోరారు. భాధి తులకు ప్రభుత్వం నుండి వచ్చే ఆర్థిక సహాయం అందివ్వాలని, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో మండల మరియు గ్రామ బిఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం