_ ఎస్సీ లబ్ధిదారులకు పశువుల పంపిణీ..
_ జిల్లా కాంగ్రెస్ పార్టీ
ఇంచార్జ్ కె.కె మహేందర్ రెడ్డి
మన ప్రగతి న్యూస్/ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో రైతులకు పశువుల పంపిణీ కార్యక్రమం మండల వైద్యాధికారి నిఖిల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు,ఈ కార్యక్రమానికి సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కె.కె మహేందర్ రెడ్డి పాల్గొన్నారు, ఈ సందర్భంగా నామాపూర్ గ్రామంలోని 15 మంది ఎస్సీ లబ్ధిదారులకు ఒక్కరికి 2 చొప్పున మొత్తం 30 పాడి పశువులను పశువైద్యాధికారులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కె.కె మహేందర్ రెడ్డి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు తెలుపుతూ పశువులకు డెలీవరి తర్వాత 12 నుంచి 15 లీటర్ల పాలు అందిస్తాయని అన్నారు,ఎస్సీ లబ్ధిదారులకు నేడు 2 పశువులను సబ్సిడీపై అందిస్తున్నామని,వీటిని వినియోగించుకుంటూ ఆర్థికంగా ప్రజలు ఎదగాలని,2 పశువులను క్రమం పద్ధతిలో 10 పశువుల స్థాయికి పెంచుకోవాలని కె.కె మహేందర్ రెడ్డి తెలిపారు.
పశువులకు సంబంధించి డైట్ చార్ట్ తెలుగులో తయారు చేసి లబ్ధిదారులకు అందించాలని పశు వైద్యాధికారిని ఆదేశించారు,నేడు 15 మంది లబ్ధిదారులకు ఒక్కరికి 2 చొప్పున 30 పశువులు పంపిణీ చేస్తున్నామని భవిష్యత్తులో ప్రతి మండల స్థాయిలో ఇటువంటి కార్యక్రమంలో నిర్వహిస్తామని తెలిపారు,సబ్సిడీతో పంపిణీ చేసిన పశువులను బయట అమ్మడానికి వీలు లేదని కె.కె మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి పశువుకు భీమా సౌకర్యం కూడా కల్పించామని తెలిపారు.పశువుల ద్వారా రోజుకు 2000 రూపాయల వరకు ఆదాయం లభిస్తుందని అన్నారు, వర్షాకాలంలో పచ్చి గడ్డి బాగా దొరుకుతుందని వీటిని వినియోగించుకుని పశువులకు మంచి ఆహారం అందించాలన్నారు.ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరు చేసిన పేద కుటుంబాలకు పశువులు పంపిణీ చేస్తున్నామని అన్నారు,బర్రెలకు ఆరోగ్యపరంగా బీమా,వైద్య సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నర్సింలు ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి, ఎంపీడీవో లచ్చాలు,జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా.రవీందర్ రెడ్డి ఈడీ ఎస్సీ కార్పొరేషన్ స్వప్న,మండల పశు వైద్యాధికారి నిఖిల,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా నాయకులు గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు, గ్రామ ప్రజలు, సంబంధిత అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

