Breaking News

సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి

_ అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన సేవలు అందించాలి

_ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

మన ప్రగతి న్యూస్ /రాజన్న సిరిసిల్ల జిల్లా స్టాపర్

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు

సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. తంగళ్ళపల్లి మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ముందుగా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది హాజరు వివరాలు రిజిస్టర్, అన్ని వార్డులు, మందుల గదిలో పరిశీలించారు. ప్రతి రోజూ ఆసుపత్రికి వైద్యం కోసం ఎందరు వస్తున్నారో ఆరా తీశారు. అనంతరం ఆసుపత్రికి వచ్చిన రోగులతో వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు.అనంతరం కలెక్టర్ మాట్లాడారు. సీజనల్ వ్యాధులు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలకు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు అందుబాటులో ఉండాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానల్లో అందించే సేవలపై అవగాహన కల్పించాలని, ప్రసవాలు జరిగేలా చూడాలని ఆదేశించారు.