బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

సీపీఎం నేత దారుణ హత్యపై మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు ఖండన

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

నిందితులను వెంటనే పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

మన ప్రగతి న్యూస్ / ఖమ్మం

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో సీపీఎం సీనియర్ నాయకుడు సామినేని రామారావు దారుణ హత్యకు గురికావడం పట్ల బిఆర్ఎస్ పార్టీ మాజీ లోక్‌సభ పక్షనేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు.ప్రశాంతంగా ఉన్న ఖమ్మం జిల్లాలో ఇటువంటి హత్యా రాజకీయాలు చోటు చేసుకోవడం విచారకరమని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలు సహజమే అయినా వాటిని హింసతో ఎదుర్కోవడం అత్యంత ప్రమాదకరమని నామ పేర్కొన్నారు.ఈ ఘటనకు బాధ్యులైన నిందితులను పోలీసులు వెంటనే పట్టుకొని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇలాంటి దారుణ సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.సామినేని రామారావు మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు నామ నాగేశ్వరరావు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.