బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

పత్తి, మొక్కజొన్న పంటలపై రైతులకు సూచనలు చేసిన వ్యవసాయ అధికారి

మన ప్రగతి న్యూస్/ ఏన్కూర్ :

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

ఏన్కూర్ మండలంలోని హిమాంనగర్ గ్రామంలో శనివారం మండల వ్యవసాయ అధికారి అవుకు నరసింహరావు రైతులతో సమావేశమై పత్తి, మొక్కజొన్న పంటలపై సూచనలు చేశారు. మొక్కజొన్న పంట వేసే రైతులు కంపెనీల వద్ద నుండి అగ్రిమెంట్ బాండ్ తప్పనిసరిగా తీసుకోవాలని, విత్తనం రసీదును పంట కాలం పూర్తయ్యే వరకు భద్రంగా ఉంచాలని సూచించారు. నవంబర్ 31వ తేదీలోపు విత్తనం పూర్తి చేయాలని తెలిపారు.పత్తి పంటలో పూత, గూడు రాలకుండా ప్రతి లీటరు నీటికి 15 గ్రాముల బోరాక్స్ కలిపి వారంలో రెండు సార్లు పిచికారి చేయాలని సూచించారు. అలాగే 2% యూరియా ద్రావణం లేదా నీటిలో కరిగే ఎరువులైన 19-19-19, 17-17-17 లేదా పొటాషియం నైట్రేట్ పిచికారి చేయడం ద్వారా మంచి పెరుగుదల సాధ్యమని తెలిపారు. కాయ దశలో కుళ్ళు రాకుండా 10 లీటర్ల నీటికి 30 గ్రాముల కాపర్ ఆక్సి క్లోరైడ్, 2 గ్రాముల ప్లాంటమైసిన్ కలిపి పిచికారి చేయాలని సూచించారు. బూస్టర్ డోసుగా 25 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ మిశ్రమాన్ని మొదల్లో కలపాలని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి లహరి, రైతులు పాల్గొన్నారు.