Breaking News

బీహార్ ఎన్నికలకు హమాలీలు.. – కొనుగోళ్ల పై ప్రభావం..

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

రాష్ట్రంలో 1024 రా మిల్లులు,970 బాయిల్డ్ మిల్లులు కలిపి మొత్తం 1997 రైస్ మిల్లులు ఉన్నాయి.లోడింగ్, అన్లోడింగ్ మిల్లుల కోసం ప్రతి మిల్లులో కనీసం 50 నుండి 200 మంది హమారీలు పనిచేస్తున్నారు.రాష్ట్రవ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారం రైస్ మిల్లులో 20వేల మంది హమాలీలు పనిచేస్తున్నారు. వీరిలో 18వేల మంది బిహారి నుంచి వలస వచ్చినవారే.బీహార్ ఎన్నికలు హోరా హోరీ గా జరుగుతుండడంతో ప్రతి ఓటు కీలకంగా మారింది.అక్కడి పార్టీలు వరుస కార్మికులపై ఫోకస్పెట్టాయి.కహగరియా,సుపౌల్ జిల్లాలోని అభ్యర్థులు తమ నియోజకవర్గాల నుంచి తెలంగాణకు వలస వచ్చిన కార్మికులకు ఫోన్లు చేసి ఓట్లు వేసి ఎందుకు రప్పించుకుంటున్నారు.ఒక్కొక్కరికి రూ.5వేలు,ఆపై ఇవ్వడంతో పాటు రానుపోను ట్రైన్ చార్జీలు చెల్లించడంతో చాలామంది బీహార్ హమాలీలు స్వస్థలాలకు వెళ్లిపోయారు.మిల్లులలో హమాలీల సంఖ్య తగ్గిపోయి, దాన్యం అన్లోడింగ్ కు తీవ్రఇబ్బంది ఏర్పడుతుంది.బీహార్ నుండి వచ్చిన హమాలీల్లో చాలామంది తమ సొంత రాష్ట్రాలకు వెళ్లడంతో మిల్లుల్లో 60% పనులు నిలిచిపోయాయి. అన్ లోడింగ్ ఆగిపోయి మిల్లుల ముందు బారులు తీరుతున్నాయి.కల్లాలలో, ఐకెపి కేంద్రాల్లో తూకాలు నిలిచి పోయాయి. బీహార్ లో ఈనెల 11 న ఎన్నికలు ముగుస్తాయి. 13 కల్లా కూలీ లంతా తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారని మిల్లర్ల యజమానులు తెలిపారు.