బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

ఆయిల్ ఫామ్ పంట సాగు భవిష్యత్తు రైతుల ఆర్థిక అభివృద్ధి

మనప్రగతిన్యూస్ /జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:

జోగులాంబ గద్వాల గద్వాల జిల్లా లోనిప్రస్తుతం ఏ పంట సాగు చేసినా రైతుకు పెట్టుబడి భారం అవుతున్నదని ఆయిల్ ఫామ్ సాగు వైపు రైతాంగం మళ్లీతే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుందని మరియు జిల్లా ఉద్యాన శాఖ అధికారి యం.ఏ.అక్బర్ అన్నారు.
మంగళవారంజిల్లా సహకార శాఖ రాజోలి ప్రాథమిక వ్యవసాయ సహకారసంఘం ఆధ్వర్యంలో ఉద్యానశాఖ తెలంగాణ ఆయిల్ ఫెడ్ సౌజన్యంతో మాందొడ్డి రైతువేదిక లో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారుప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సింగిల్ విండో చైర్మన్ గోపాల్ రెడ్డిఅధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా హార్టికల్చర్ అధికారి అక్బర్ మాట్లాడుతూ, రైతులకు వ్యవసాయమే పెద్ద గుదిబండ అవుతున్న తరుణంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే పంటలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిచారించాయన్నారు. ఈ పంట సాగు వల్ల క్రిమిసంహారక మందుల వినియోగం 90 శాతం పైనే తగ్గిపోతుందని, దాంతో వాతావరణ కాలుష్యం భూసారం తగ్గిపోవడం వంటి అనేక అవరోధాలు తొలగిపోతాయన్నారు. జిల్లా సహకార అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో పామ్ ఆయిల్ దిగుమతి కోసం ఏటా 70 వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఫారిన్ ఎక్సేంజ్ ప్రభుత్వం వెచ్చిస్తుందని, ఆ ఖర్చును ఆయిల్ ఫామ్ సాగు చేసేందుకు పెద్ద ఎత్తున రైతులకు సబ్సిడీ అందిస్తే, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లబ్ది పొందే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతో రైతులను ఆ దిశగా కార్యోన్ముఖులను చేస్తుందన్నారు.సహకార సంఘాల ద్వారానే రైతుల సమీకరణ, మంచి కార్యాచరణ ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం పాక్స్ ల ద్వారా ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో టీజీ ఆయిల్ ఫేడ్ జిల్లా మేనేజర్ శివనాగిరెడ్డి ఆర్టికల్చర్ ఆఫీసర్లు మహేష్,రాజశేఖర్ మండల వ్యవసాయ అధికారి సురేఖ, ఏఈఓ లు, హెచ్ఈఓ శివకుమార్, ఫీల్డ్ ఆఫీసర్లు యశ్వంత్, అశోక్, త్రివిక్రమ్ మరియు వివిధ గ్రామాల నుంచి 200 మంది రైతులు పాల్గొన్నారు.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు