బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

గ్రామ పంచాయతీ ఎన్నికలకు 2011 ప్రకారమే రిజర్వేషన్ లు

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

మన ప్రగతి న్యూస్ / వనపర్తి ప్రతినిధి :

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

గ్రామ పంచాయతీ ఎన్నికలకు 2011 జనాభా లెక్కలు మరియు డెడికేషన్ కమిషన్ ఇచ్చిన వివరాల ప్రకారం మాత్రమే రిజర్వేషన్ రూపకల్పన చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం ఐ.డి. ఒ.సి సమావేశ మందిరంలో ఎంపీడీఓ లు, ఎంపిఓ లతో గ్రామ పంచాయతీ, వార్డుల రిజర్వేషన్ ప్రక్రియ పై అవగాహన కల్పించారు.ఎస్సీ ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం బి.సి లకు రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. డెడికేషన్ కమిషన్ ఇచ్చిన వివరాల ఆధారంగా వార్డులలో కేటగిరి వారిగా రిజర్వేషన్ ప్రక్రియ పకడ్బందీగా సిద్ధం చేయాలని సూచించారు. ఎన్నికల కమిషన్ నుండి ఉత్తర్వులు వచ్చాక కేటగిరి వారిగా 50 శాతం రిజర్వేషన్ మహిళలకు డిప్ ద్వారా కేటాయించాల్సి ఉంటుందని తెలియజేశారు. జిల్లాలోని 268 గ్రామ పంచాయతీలలో కొత్తగా ఏర్పడిన 13 గ్రామ పంచాయతీలకు మొదటి రొటేషన్ విధానం ద్వారా మిగిలిన గ్రామ పంచాయతీలకు రెండవ రొటేషన్ విధానాన్ని అనుసరించాలని సూచించారు. తుది జాబితా ఇచ్చేటప్పుడు తప్పులు లేకుండా ఒకటికి పదిసార్లు చూసుకొని సంతకంతో ఇవ్వాలని ఆదేశించారు. కాగా ఎంపీడీఓ లు, ఎంపీఓ లు జడ్పీ సి. ఈ.ఓ, జిల్లా పంచాయతీ అధికారి, ఆర్డీఓ సహకారంతో వార్డుల వారిగా రిజర్వేషన్ల ప్రక్రియపై రోజంతా నిమగ్నమై ఉన్నారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీ యాదయ్య, డిపిఓ తరుణ్ చక్రవర్తి, ఆర్డిఓ సుబ్రహ్మణ్యం, డిఎల్పీఓ రఘునాథ్ రెడ్డి, ఎంపీడీఓ లు, ఎంపీఓ లు ఉన్నారు.