బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

రావుల గిరిధర్, ఐపీఎస్ కి ఘనమైన వీడ్కోలు

బాల్యవివాహాల నిర్మూలన – సైబర్ నేరాల నియంత్రణలో మార్గదర్శక కృషి

సేవలో క్రమశిక్షణ – విలువల్లో నిబద్ధత

మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూర్:-

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

జిల్లా బదిలీ నేపథ్యంలో, జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ సేవలను స్మరించుకుంటూ జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు సభ ఘనంగా నిర్వహించారు. తన పదవీకాలమంతా బాల్యవివాహాల నిర్మూలన, సైబర్ నేరాల నివారణ, ప్రజా భద్రతాభివృద్ధి దిశగా అనేక ప్రత్యేక కార్యక్రమాలు, సంస్కరణ చర్యలు,అవగాహన యత్నాలు చేపట్టి, జిల్లాలో శాంతి భద్రతల బలోపేతానికి అహర్నిశం కృషి చేసినందుకు అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు ఆయనకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఐఏఎస్ పాల్గొని, ఎస్పీ ని శాలువాతో, ఘనంగా సత్కరించారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లా శాంతి భద్రతల పరిరక్షణలో, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో, బాల్యవివాహాల నిర్మూలనలో, సైబర్ నేరాల నియంత్రణలో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ నాయకత్వం విశేషమైనది. ప్రజలకు దగ్గరగా ఉండే పోలీసింగ్ పద్ధతిని అమలులోకి తీసుకువచ్చి, సేవలో సమగ్రత–నిబద్ధతకు కొత్త ప్రమాణాలు నెలకొల్పారు.జిల్లా మొత్తానికీ ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా ప్రజల తరఫున మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నానని కలెక్టర్ అన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఎస్పీ మాట్లాడుతూ… ఈ నేల మీద అడుగుపెట్టిన తొలి క్షణం నుంచి ఈ జిల్లా నాకు విధి కంటే ఎక్కువగా, ఒక కుటుంబం లాంటిది అయింది. నన్ను ఆదరించి,నమ్మి,అండగా నిలిచిన జిల్లావాసులందరికీ నా హృదయపు ప్రణామాలు. పోలీసింగ్ అనేది ఒక్కరితో సాధ్యపడే పని కాదు ప్రజల సహకారమే శాంతి సూత్రం, భద్రత తీరాన్ని నిర్మిస్తుందని ఈ నేలపై గడిపిన ప్రతి క్షణం నా హృదయంలో ఒక జ్ఞాపకం ప్రతి చిరునవ్వు, ప్రతి ఆశీర్వాదం నా జీవితంలో ఒక వెలుగు. నేడు నేను ఇక్కడి నుంచి ప్రయాణం మొదలు పెడుతున్నానని వనపర్తి అనే చిన్న బిందువుకు ప్రేమతో నిలిచి ఉంటుంది.నన్ను ఇంతగా నమ్మిన ఈ జిల్లాకు మరింత శాంతి మరింత ప్రగతి, మరింత గౌరవం జరగాలని నానా మనసారా కోరుకుంటానని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సతీమణి బండి అపర్ణ, ఏఆర్ అదనపు ఎస్పీ,వీరారెడ్డి, వనపర్తి డిఎస్పి,వెంకటేశ్వరరావు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, లోకనాథ్ రెడ్డి, వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్, శ్రీనివాస్ గౌడ్, వనపర్తి సీఐ, కృష్ణయ్య, కొత్తకోట సిఐ, రాంబాబు, ఆత్మకూర్ సిఐ, శివకుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, అప్పలనాయుడు, శ్రీనివాస్, జిల్లాలోని పోలీసు అధికారులు సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు తదితరులు పాల్గొన్నారు.