మన ప్రగతి న్యూస్ /తల్లాడ
తల్లాడ మండలం మల్లవరం గ్రామంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కానుకగా ఇస్తున్న ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు కటికి కిరణ్ కుమార్ పాల్గొని మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు..ఈ కార్యక్రమంలో గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యులు, తల్లాడ మండల ఎస్టీసెల్ అధ్యక్షులు భూక్య అంజయ్య, యూత్ ఉపాధ్యక్షులు దుగ్గిదేవర్ రవీంద్ర, కుప్పల నరసింహారావు, మహిళా సోదరీమణులు మల్లవరం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.

