బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

వక్ఫ్ బోర్డ్ వ్యథ తీర్చెన్… ప్రజల మనసులు మరోమారు గెలిచెన్…

వక్ఫ్ బోర్డ్ వ్యథ తీర్చెన్… ప్రజల మనసులు మరోమారు గెలిచెన్…

వక్ఫ్ బోర్డు సమస్య పరిష్కరించినందుకు ఎమ్మెల్యే కెపి వివేకానంద్ కి ధన్యవాదాలు తెలిపిన పద్మానగర్ ఫేజ్ – 2 వాసులు

మన ప్రగతి న్యూస్ / కుత్బుల్లాపూర్ నియోజక వర్గం

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 131 – కుత్బుల్లాపూర్ డివిజన్ పద్మా నగర్ ఫేజ్ -1, పద్మా నగర్ ఫేజ్ -2 సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసి వక్ఫ్ బోర్డు సమస్యతో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పునరుద్ధరించేలా సమస్యను పరిష్కరించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సంధర్బంగా పద్మనగర్ ఫేజ్ -1, ఫేజ్ -2 వాసులు మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ లోని 55 కాలనీలలో, 171 సర్వే నెంబర్లలో గత కొన్ని రోజులుగా వక్ఫ్ బోర్డు పేరుతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిలిపివేశారు. ఈ కాలనీలలోని దాదాపు 90 శాతం మంది ప్రజలు అప్పులు చేసి, లోన్లు తీసుకొని పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ప్లాట్లు కొని పెట్టుకుంటే వక్ఫ్ బోర్డు పేరుతో ప్రజలను వ్యధకు గురిచేస్తున్న విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఇప్పటికే పలుమార్లు ఆర్డీవో, కలెక్టర్, డిఆర్, డిఐజి, ఐజీ వంటి ఉన్నతాధికారులను కలిసి మాట్లాడి, సమస్య పరిష్కారమే ధ్యేయంగా ఎమ్మెల్యే ప్రజల పక్షాన పోరాడి సమస్యను పరిష్కరించినందుకు ధన్యవాదాలు తెలియచేశారు.
అనంతరం ఎమ్మెల్యే కెపి వివేకానంద్ మాట్లాడుతూ నాకు మద్దతుగా నిలిచి నన్ను భారీ మెజార్టీతో గెలిపించిన కుత్బుల్లాపూర్ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పద్మా నగర్ ఫేజ్ -1 అధ్యక్షులు దేవరకొండ శ్రీనివాస్, పద్మా నగర్ ఫేజ్ -2 అధ్యక్షులు సత్తిరెడ్డి, సంక్షేమ సంఘాల సభ్యులు పప్పిరెడ్డి సురేందర్ రెడ్డి, సతీష్ రెడ్డి, సతీష్, అప్పారావు, మురళీ, బ్రహ్మానందం, దేవేందర్ రెడ్డి, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.