Breaking News

ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలి.

  1. రఘునాథపల్లి ఎస్సై డి. నరేష్

మన ప్రగతి న్యూస్/
రఘునాథపల్లి :

రఘునాథపల్లి మండల ప్రజలు గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా మద్యం నిల్వ, అమ్మకాలు చేయకూడదని.. బెల్ట్ షాప్స్ నడపవద్దని ఎస్సై నరేష్ సూచించారు. సోషల్ మీడియాలో ఎలాంటి రెచ్చగొట్టే వాఖ్యలు, శాంతి భద్రతలకు విఘాతo కలిగించే చర్యలకు దిగవద్దని చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎమ్మార్వో ముందు బైండోవర్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేటట్లు అందరూ సహకరించాలని కోరారు.. మీకు ఏదైనా సమస్యలు ఉంటే 100 డయల్ లేదా పోలీస్ స్టేషన్ నెంబర్ 8712685035, SHO నెంబర్ 8712685211 చేయాలని సూచించారు.

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..