బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి 

ఆర్వోలు, ఏఆర్వోలు అప్రమత్తంగా ఉండాలి 

నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేందుకు చర్యలు 

ఎంపీడీవో వి.వేదవతి 

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

మనప్రగతిన్యూస్/పాలకుర్తినియోజకవర్గం ప్రతినిధి:

నామినేషన్ల స్వీకరణకు క్లస్టర్ల వారిగా ఏర్పాట్లను పూర్తి చేశామని ఎంపీడీవో వర్కల వేదవతి తెలిపారు. మంగళవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో గల ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు స్టేజి వన్ ఆర్ వో, ఏ ఆర్ వి ఓలకు నామినేషన్ల స్వీకరణ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి జిల్లా మాస్టర్ ట్రైనర్ అన్నావజుల నరసింహమూర్తి తో కలిసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వేదవతి మాట్లాడుతూ రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా మూడో విడత నామినేషన్ల ప్రక్రియలో క్లస్టర్లను గుర్తించామని తెలిపారు. 38 గ్రామాలకు 12 క్లస్టర్లను ఏర్పాటు చేశామని, ఏ క్లస్టర్ కు ఏ గ్రామాలు నామినేషన్ల ప్రక్రియకు హాజరుకావాలో సమాచారాన్ని అందించామని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా క్లస్టర్ కేంద్రాలలో ఏర్పాట్లను పూర్తి చేశామని వివరించారు. నామినేషన్లు సజావుగా జరిగేందుకు రాజకీయ పార్టీల నాయకులు ఆర్వోలు, ఏఆర్ఓలకు సహకరించాలని సూచించారు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులకు నామినేషన్ పత్రాల్లో పొందిపరిచి ఉన్న అన్ని విషయాలను వివరించాలని అధికారులకు సూచించారు. నామినేషన్ల స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని తెలిపారు. నామినేషన్ల స్వీకరణ సందర్భంగా ఆర్వోలు, ఏ ఆర్ ఓ లు అప్రమత్తంగా ఉంటూ గ్రామాల వారీగా నామినేషన్లను స్వీకరించుకోవాలని దిశా నిర్దేశం చేశారు. రెండో విడత గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికల్లో భాగంగా మూడో విడత గ్రామపంచాయతీ నామినేషన్ల ప్రక్రియ నేటి నుండి ప్రారంభమవుతుందని తెలిపారు. ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకోవాలని తెలిపారు. ఈనెల 3 నుండి 5 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సూత్రం సరస్వతి, ఎంపీ ఓ శ్రీనాథ్ రెడ్డి లతోపాటు ఆర్వోలు, ఏ ఆర్ ఓ ల పాల్గొన్నారు.