పాలకుర్తి,దేవరోప్పుల, కొడకండ్ల మండలాల్లో నామినేషన్ స్వీకరణ కి ఏర్పాట్లు పూర్తి
ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించాలి
జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:
సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు జరిగే మూడవ విడత నామినేషన్ స్వీకరణ ప్రక్రియకి పూర్తి ఏర్పాట్లును పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలో విలేకరులతో కలెక్టర్ మాట్లాడారు.ఈ నెల 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు పాలకుర్తి దేవరోప్పుల, కొడకండ్ల మండలాలకు సంబంధించిన 91 గ్రామపంచాయతీలు, 800 వార్డులకు జరిగే మూడవ విడత నామినేషన్ ప్రక్రియకి సంబందించి అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నారన్ని 5 గంటలకు నామినేషన్ కేంద్రం గేటు మూసివేయాలని, నామినేషన్ కేంద్రంలో ఉన్న అభ్యర్థుల నుండి మాత్రమే నామినేషన్లు స్వీకరించాలని,ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి ప్రక్రియ ను త్వరగా పూర్తి చేసేలా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఎన్నికల నిర్వహణ లో అలసత్వం వహించే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నామినేషన్ స్వీకరణ కేంద్రం ముందు గ్రామపంచాయతీలోని వార్డుల వారీగా ఫోటో ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల వివరాలను ప్రదర్శించాలని, నామినేషన్ కేంద్రం నుండి 100 మీటర్ల పరిధిలో గుంపులుగా ఎవరిని అనుమతించరని,నామినేషన్ సమర్పించే అభ్యర్థులు ప్రతిపాదించే వారికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు.నామినేషన్ల స్వీకరణలో ఎన్నికల సంఘం జారీ చేసిన నియమాలకు లోబడి వ్యవహరించాలని, నామినేషన్ పత్రాల స్వీకరణ, నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల ప్రకటన, గుర్తుల కేటాయింపు ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులకు కలెక్టర్ తెలిపారు.

