Breaking News

ఎన్నికల భద్రతకు కట్టుదిట్టం

ఏన్కూర్ ఎస్సై ఎన్ సంధ్య

మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్

బైక్ స్కిడ్ అయి యువకుడికి తీవ్ర గాయాలు

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు పూర్తి చేసినట్లు ఏన్కూర్ ఎస్సై సంధ్య తెలిపారు. ఈ నెల 3 నుంచి 5 వరకు జరగనున్న నామినేషన్ ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసులు బందోబస్తును మరింత బలోపేతం చేసినట్లు ఆమె తెలిపారు.కీలక కేంద్రాల వద్ద ప్రత్యేక పహారా, రౌండ్లు, చెక్‌పోస్టులు, నిఘా చర్యలు చేపట్టినట్లు వివరించిన ఎస్సై సంధ్య, ఎన్నికల సమయంలో ప్రజలు మరియు అభ్యర్థులు భయభ్రాంతులకు గురికాకుండా శాంతి భద్రతలను కట్టుదిట్టంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.