బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
అంతర్జాతీయం

నర్సంపేట ప్రజలకు హిందూ సమాజానికి సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పిన తర్వాతే నర్సంపేటలో పర్యటించాలి

డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

మన ప్రగతి న్యూస్ /నర్సంపేట

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

నర్సంపేట పట్టణ విలేకరుల సమావేశంలో డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ….. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గ పర్యటన డిసెంబర్ 5వ తేదీన ఉండటం చాలా సంతోషకరం కానీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు పరుస్తామని నర్సంపేట నియోజకవర్గ ప్రజలచే ఓట్లు వేయించుకొని గత రెండు సంవత్సరాలుగా ఈ హామీలను అమలు పరచకుండా నర్సంపేట ప్రజలను గాలికి వదిలేసి ఈరోజు మళ్లీ ఎ మొసం చేయడానికి నర్సంపేట పర్యటన పెట్టుకున్నారు.
నర్సంపేట నియోజకవర్గంలో మొంతా తుఫాను ద్వారా అరుగాలం కష్టపడి పండించిన పంట అంతా నష్టపోయిన రైతులను పరామర్శించకుండా వారికి పంట నష్టపరిహారం ఇవ్వకుండా కేవలం గ్రామపంచాయతీ ఎన్నికల కోసం మీరు పర్యటన చేయడం హాస్యస్పందం.
మీరు హిందూ దేవుళ్ళు,హిందూ సమాజం మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనకకు తీసుకొని యావత్ హిందూ సమాజానికి క్షమాపణ తెలిపిన తర్వాత మా నర్సంపేట నియోజకవర్గ పర్యటన పెట్టుకోండి.ఇక్కడ ఉన్న శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి మరియు మీరు సఖ్యతతో ఉండి మా నర్సంపేట నియోజకవర్గంను అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము.
హిందూ సమాజానికి నర్సంపేట నియోజకవర్గ ప్రజానీకానికి మీరు రేపటి రోజున క్షమాపణ చెప్పి డిసెంబర్ 5వ రోజున మీ పర్యటన చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మీరు క్షమాపణ చెప్పని యెడల మీ పర్యటనను నర్సంపేట నియోజకవర్గ బిజెపి పార్టీ అడ్డుకుంటుందని హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ వడ్డేపల్లి నరసింహా రాములు, జిల్లా ఉపాధ్యక్షుడు రేసు శ్రీనివాస్, పార్లమెంట్ కోకన్వీనర్ కట్ల రామచందర్ రెడ్డి, సీనియర్ నాయకులు పృథ్వీరాజ్, వనపర్తి మల్లయ్య, కుంభం కోమల్ రెడ్డి శీలం సత్యనారాయణ, మల్యాల సాంబమూర్తి, మరియు నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్,రూరల్ అధ్యక్షులు తనుగుల అంబేద్కర్, ప్రధాన కార్యదర్శులు సూత్రపు సరిత,కందికొండ శ్రీనివాస్, కీసరి సాంబరాజు,బట్టు మదన్, వరంగల్ జిల్లా యువ మోర్చా నాయకులు అచ్చ దయాకర్, జూలూరు మనీష్ గౌడ్,ఎర్ర రాజు, నర్సంపేట పట్టణ, రూరల్ బిజెపి, యువ మోర్చా నాయకులు అందరూ పాల్గొన్నారు.