బిజెపి నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్
మన ప్రగతి న్యూస్/ నర్సంపేట
బీజేపీ రాష్ట్ర , జిల్లా పార్టీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఆదేశానుసారం నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం దగ్గర సీఎం రేవంత్ రెడ్డి హిందువులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి సీఎం వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అనంతరం మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి హిందువులపై చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయి. హిందువుల గౌరవాన్ని అవమానించేలా చేసిన ఈ అనుచిత వ్యాఖ్యలపై సీఎం వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలి” అని స్పష్టం చేశారు. సీఎం నర్సంపేట పర్యటనకు వచ్చేముందు నర్సంపేట లోని హిందూ బంధువులకు అందరికీ క్షమాపణ చెప్పిన తర్వాతే నర్సంపేట పర్యటనకు రావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో….వనపర్తి మల్లయ్య, కుంభం కోమల్ రెడ్డి శీలం సత్యనారాయణ, మల్యాల సాంబమూర్తి, పొనుగోటి రవీంద్ర చారి, రూరల్ అధ్యక్షులు తనుగుల అంబేద్కర్, ప్రధాన కార్యదర్శులు సూత్రపు సరిత,కందికొండ శ్రీనివాస్, కీసరి సాంబరాజు,బట్టు మదన్, వరంగల్ జిల్లా యువ మోర్చా నాయకులు అచ్చ దయాకర్, జూలూరు మనీష్ గౌడ్,ఎర్ర రాజు, పల్లకొండ శ్రీను, పట్టణ ఉపాధ్యక్షులు విజయ్ సింగ్,కాసుల నాగేంద్ర బాబు, ముత్యాల శ్రీనివాస్,శివ, చిలువేరు అన్వేష్, నర్సంపేట పట్టణ, రూరల్ బిజెపి, యువ మోర్చా నాయకులు అందరూ పాల్గొన్నారు.



