బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

యాసంగి సీజన్ లో ఎరువులకు ఎలాంటి ఇబ్బందులుఉండవు

ఎరువుల కేంద్రాల ఏర్పాటుతో సత్ఫలితాలు 

రైతులకు రవాణ ఖర్చులు తగ్గించేందుకు కృషి 

రైతులకు సరిపడా యూరియా 

వ్యవసాయ శాఖ ఉపసంచాలకులు పరశురాం నాయక్ 

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:

యాసంగి సీజన్ లో రైతులకు ఎరువుల పట్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు క్లస్టర్ ల వారీగా ఏర్పాటు చేసిన ఎరువుల కేంద్రాలతో సత్ఫలితాలు వస్తున్నాయని వ్యవసాయ శాఖ పాలకుర్తి డివిజన్ ఉపసంచాలకులు అజ్మీర పరశురాం నాయక్ అన్నారు. బుధవారం మండలంలోని పలు ఎరువుల కేంద్రాలను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా పరశురాం నాయక్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆదేశాల మేరకు బుధవారం మండల కేంద్రంలోని యూరియా సరఫరా చేస్తున్న షాపులను పరశురాం నాయక్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా యూరియా పంపిణీలో గ్రామాల వారీగా టాకింగ్ విధానాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ట్యాగింగ్ విధానంతో రైతులు యూరియాతోపాటు కాంప్లెక్స్ చెరువులను తీసుకుంటున్నారని వివరించారు. యూరియా పట్ల రైతులకు ఆందోళన వద్దని తెలిపారు. యాసిన్ సీజన్లో రైతులకు సరిపడా యూరియా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. ఒకే చోట యూరియా పంపిణీ తో పాటు ఎరువుల పంపిణీ వల్ల రైతులు బారులు తీరి ఇబ్బందులు పడుతున్నారని, రైతుల ఇబ్బందులను తొలగించడంతోపాటు రవాణా ఖర్చులను తగ్గించేందుకు ఆయా గ్రామాల్లోనే ఎరువుల కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. యూరియాతోపాటు ఎరువుల కొనుగోలు కోసం వచ్చే రైతులు విత్తన కొనుగోలు రసీదు, పట్టాదారు పాసుబుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ తప్పనిసరిగా తీసుకొని రావాలని రైతులకు సూచించారు. పాలకుర్తి మండలంలో ఇప్పటివరకు 564 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందించామని తెలిపారు. మండలంలోని ఎరువుల కొనుగోలు కేంద్రాల ద్వారా ఒక్కరోజే 3200 యూరియా బస్తాలను రైతులకు అందజేశామని అన్నారు. రైతులు క్యూ లైన్ ల పేరుతో ఇబ్బందులు పడటం లేదని, ఎరువుల కేంద్రాల ద్వారా యూరియాతో పాటు కాంప్లెక్స్ చెరువులను కొనుగోలు చేసుకుంటున్నారని వివరించారు. రైతులు యూరియాతోపాటు నానో యూరియా పై దృష్టి పెట్టాలని సూచించారు. నానో యూరియా ద్వారా నేల ఆరోగ్యకరంగా ఉంటుందని, పర్యావరణ ప్రభావం తగ్గడంతోపాటు ఖర్చును కూడా తగ్గించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. సరైన పోషక నిర్వహణ సాధ్యం కావడం వంటి ప్రయోజనాలు అందుతాయి అన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన గ్రామ ట్యాగింగ్ మార్గదర్శకాలు అమలయ్యే విధంగా రైతులు వ్యవసాయ శాఖ సిబ్బందికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి కాకి శ్రీనివాస్ రెడ్డి, ఏ ఈ ఓ లు జాటోతు రాధిక, ముత్తినేని వెంకటేష్, మాన్యపు దీపక్, కీర్తి, సువర్ణ, మహేష్, శ్యామల తో పటు రైతులు పాల్గొన్నారు.