తరగతి గదులకు తాళాలు
పాఠశాలకు కాపలా ఉపాధ్యాయుడే
కనపడని మిడ్ డే మీల్స్ వర్కర్స్
మన ప్రగతి న్యూస్/కల్లూరు ప్రతినిధి:
కల్లూరు మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల మొత్తం ఖాళీగా దర్శనమిచ్చింది. ప్రధాన ఉపాధ్యాయుడు బానోత్ లక్ష్మణ్ ను వివరణ కోరగా గత సంవత్సరం విద్యార్థులు లేక మూసివేసిన పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పున ప్రారంభించారు. దానితోపాటు సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యేక నిధులు కేటాయిస్తున్న గాని అక్కడ విద్యార్థుల కొరత ఒకటి నుంచి ఏడు తరగతులు చదవాల్సిన విద్యార్థులు కనీసం ఒకటి రెండు తరగతులతోనే కొనసాగిస్తున్నారు. పూర్తిగా తరగతి గదులకు తాళాలు వేసి ఉన్నాయి. ఒక్క తరగతి గదినే తెరిచి ఉంచారు.
ఉపాధ్యాయుడు ఒక్కడే తరగతి గదిలో వేచి ఉన్నాడు. ఉన్న ముగ్గురు విద్యార్థులలో ఒక్కరు కూడా కనపడని తీరు. వివరణ కోరగా ముగ్గురు విద్యార్థులు ఒకటవ తరగతిలో ఇద్దరూ, రెండో తరగతి ఒక్కరు ఉన్నట్టుగా సమాధానం ఇచ్చారు, ముగ్గురు విద్యార్థులతో ఉన్నత పాఠశాల నిర్వహిస్తున్న అధికారులు. కానరాని మిడ్ డే మిల్స్ వర్కర్స్ ప్రభుత్వం అన్ని విధాలుగా విద్యార్థులకు పౌష్టికాహారం అందించే దిశగా అడుగులు వేస్తూ ఎంతో ప్రజా ధనాన్ని ప్రభుత్వ పాఠశాలకు వెచ్చిస్తుంటే ఇక్కడ మాత్రం ఈ పాఠశాలలో మిడ్ డే మిల్స్ పిల్లలకు అందుతున్నట్లు లేదని స్థానికులు తెలిపారు, ఉన్నత పాఠశాల మొత్తానికి కూడా తాళాలు వేసి కాపలా కాస్తున్న ఉపాధ్యాయుడు. విద్యార్థులు పాఠశాలలో లేకున్నా తరగతులను నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు. దీనిపై ప్రభుత్వ అధికారులు దృష్టి సారించి పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని అలాగే విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.


