బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

కామారెడ్డిగూడెం మాజీ సర్పంచ్ తో పాటు నాయకులు

ఝాన్సీ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ లో చేరిక

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

దేవరుప్పుల మండలంలోని కామారెడ్డిగూడెం గ్రామ మాజీ సర్పంచ్ చింత సోమయ్య తో పాటు నాయకులు చింత యాదగిరి సాయి తో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బుధవారం టి పి సి సి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో పార్టీలో చేరారు. వారికి ఝాన్సీ రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డిగూడెం నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ చేరడంతో పార్టీకి మరింత బలం చేకూర్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ తోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వమే సరైన మార్గం అనే నమ్మకంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేపట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో అన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి గ్రామాలలో కాంగ్రెస్ జెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన కామారెడ్డి గూడెం మాజీ సర్పంచ్ సోమయ్య, యాదగిరి, సాయి మాట్లాడుతూ, గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం టీపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి సహకారంతో తమ సేవలను కొనసాగిస్తామని, కాంగ్రెస్ పార్టీలో చేరడం తమకు గర్వంగా ఉందని స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు.