Breaking News

ఎట్టకేలకు మరో చోటికి మారిన మద్యం దుకాణాలు

-ఫలించిన అఖిలపక్షాల కృషి

మన ప్రగతి న్యూస్/ భూధాన్పోచంపల్లి:

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు

యాదాద్రి భువనగిరి జిల్లా, మండల, నగరపాలక కేంద్రమైన భూదాన్ పోచంపల్లి లో ప్రధాన కూడళ్లకు సమీపంలో ఉన్న వైన్సులు( మద్యం దుకాణాలు) ఎట్టకేలకు ఉన్నచోటు నుండి మరోచోటకు మారాయి. దీంతో ప్రతి పక్షాల కృషి ఫలించి నట్ల యింది. మద్యం దుకాణాలు వేరే చోటికి తరలడంతో అఖిలపక్షాలవారు ఇప్పటికే ప్రధాన కూడలిలో బాణాసంచ పేల్చారు. ఎంపీ, ఎమ్మెల్యే, చిత్రపటాలకు పాలాభి షేకం చేయడమైనది. ఎమ్మెల్యే వద్దకు తరలి వెళ్లి ఎమ్మెల్యేను సన్మా నించడం జరి గింది. కుల, యువజన ససంఘాలు, ఖిలపక్షాలు ,పట్టణవాసులు పట్టిన పట్టు వి డవకుండా మద్యం దుకాణాలు ఉన్నచోట నుండి మరోచోటికి తరలే వరకు ఉడుం పట్టులా పట్టి, మొత్తానికి సాధించారు. ప్రధాన కూడళ్లకు సమీపంలో రోడ్డుకు దగ్గ రలో ఈ దుకాణాలు ఉండడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని, ముఖ్యం గా వ్యాపారస్తులు, విద్యార్థులు ,వాహనదారులు, ఆయా ప్రాంతాల నుండి వచ్చే పర్యాటకులు సైతం ట్రాఫిక్ స్తంభించడంతో ఇబ్బందికి గురవుతున్నారని ఎంపీ, ఎ మ్మెల్యే ,జిల్లా కలెక్టర్, ఎక్సైజ్ శాఖ జిల్లా సూపరింటెండెంట్ ,స్థానిక తహాసిల్దార్, నగరపాలక సంస్థ కమిషనర్, తదితరులకు మధ్యందుకానాలను మరోచోటికి తర లించాలని అందజేసిన వినతి పత్రాల్లో కోరడం జరిగింది. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం సైతం చేపట్టారు. మద్యం దుకాణాలను తరలింపు కై ధర్నాకు సైతం సమయతమయ్యారు .ఈ సమయంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి జో క్యం చేసుకొని మద్యం దుకాణాలను ఉన్న చోటు నుండి పట్టణ శివారుకు తరలిం ప చేయించారు. దీంతో వ్యాపారస్తులు ,విద్యార్థులు ,వాహనదారులు, ప్రజలు అ ఖిలపక్షాలవారికి కృతజ్ఞతలు తెలియజేషారు.