మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూర్:-
వనపర్తి జిల్లా ఆత్మకూర్ పట్టణ కేంద్రంలో గురువారం రోజు ఇలాంటి అనుమతి లేకుండా అక్రమంగా కర్నే గ్రామానికి చెందిన గుంటిపల్లి గుజ్జుల బుచ్చన్న అక్రమంగా ఎలాంటి అనుమతి లేకుండా స్థానిక గాంధీ చౌరస్తాలో మద్యాన్ని తీసుకుపోతున్న క్రమంలో ఆత్మకూరు సబ్ ఇన్స్పెక్టర్ జయన్న వారి సిబ్బందితో కలిసి పట్టుకోవడం జరిగింది. మద్యం బాటిల్స్ మొత్తం 3.150 లీటర్లు ఉన్నట్లు వాటి విలువ 3465 రూపాయలు కావున మట్టి మద్యం సీసాలను సీజ్ చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆత్మకూరు సబ్ ఇన్స్పెక్టర్ జయన్న తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎవరైనా అక్రమ మద్యం చేసిన ఎడల వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.

