బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

వృద్ధ దంపతుల అనుమానాస్పద మృతి

అంత్యక్రియలను అడ్డుకున్న పోలీసులు

ఏసీపీ ఆదేశాల మేరకు పోస్టుమార్టంకు తరలింపు

మన ప్రగతి న్యూస్ /వీణవంక:

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

వీణవంక నర్సింగాపూర్ గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. స్థానికుల సమాచారంతో అంత్యక్రియలను అడ్డుకున్న పోలీసులు. నడవలేని స్థితిలో ఉన్న వారు పురుగుల మందు ఎలా తాగారని అనుమానంతో పోస్టు మార్టంకు పంపిన హుజూరాబాద్ ఏసీపీ మాధవి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన సింగిరెడ్డి కొమురా రెడ్డి (90), చిలుకమ్మ (75) దంపతులకు నలుగురు కుమార్తెలు , ఒక కొడుకు ఉన్నారు. కొంతకాలంగా వృద్ధ దంపతులు ఒకే గదిలో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా పెద్ద కూతురు శుక్రవారం మధ్యాహ్నం ఎలుబాక గ్రామం నుండి తల్లిదండ్రులు నివసిస్తున్న నర్సింగాపూర్ లోని వారి ఇంటికి వెళ్లి తలుపులు తీసి చూడగా ఇద్దరు మృతిచెంది ఉన్నారు. ఈ క్రమంలో అంత్యక్రియల కోసం సిద్ధం చేస్తుండగా స్థానికుల సమాచారం అందగా సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాలను పరిశీలించగా అనుమానాస్పదంగా ఉందని గమనించి అంత్యక్రియలను నిలిపివేశారు. ఏసీపీ మాధవి వృద్ధ దంపతుల మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం చేయాలని తెలుపగా జమ్మికుంటకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా నడవలేని స్థితిలో ఉన్న వారు పురుగుల మందు ఎలా దొరికింది . స్థానికులను విచారించగా అనుమానం వ్యక్తం చేశారు. ఎస్ఐ ఆవుల తిరుపతిని వివరణ కోరగా పురగులు మందుడబ్బా ఇంట్లో దొరికిందని, పురుగులు మందుతాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఉందని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.